: కిక్కిరిసిన ట్యాంక్ బండ్ పరిసరాలు.. మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు


హైదరాబాదులో నిన్న ప్రారంభమైన వినాయక నిమజ్జనం రెండో రోజూ జోరుగా కొనసాగుతోంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు పెద్ద ఎత్తున గణేశ్ నిమజ్జనాన్ని తిలకించేందుకు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. వేలాదిగా తరలివస్తున్న విగ్రహాలను పోలీసులు ఎన్టీఆర్ మార్గ్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు మళ్లిస్తున్నారు. ఇందుకోసం రోడ్లను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు డ్యూటీలకు వెళ్లే వారు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నెక్లెస్ రోడ్డుకు 700 విగ్రహాలు చేరుకున్నాయి. దాదాపు రెండు వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు అధికారులు తెలిపారు. నిమజ్జనం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News