: పెద్దలందరికీ చంద్రబాబు ‘అన్న’ అయితే... యువతకు 'అన్న' లోకేష్!: దేవినేని అవినాష్


పెద్దలందరికీ చంద్రబాబు ‘అన్న’ అయితే, యువతకు లోకేష్ ‘అన్న’తో సమానమని దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఉన్నారు కనుక తమ భవిష్యత్ కు ఎటువంటి ఢోకా లేదని, మరో 30 ఏళ్లు కృష్ణాజిల్లా గడ్డపై టీడీపీ జెండా ఎగురుతుందని అవినాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని, తాము కూడా సైనికుల్లా పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉన్నారంటే, డానికి చంద్రబాబే కారణమని అవినాష్ అన్నారు.

  • Loading...

More Telugu News