: కుక్క తెచ్చిన తంటా.. నటుడు వేణుమాధవ్ పై కేసు
ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కు తన పెంపుడు కుక్క ద్వారా కష్టం వచ్చి పడింది. అతడిపై హైదరాబాద్ లో కేసు నమోదు అయింది. వేణు మాధవ్ పెంపుడు కుక్క తనను కరచిందంటూ ఒక ఇంటర్ విద్యార్థి మౌలాలీ పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఫిర్యాదు చేశాడు. పెంపుడు కుక్కపై, దాని యజమాని వేణుమాధవ్ పై చర్య తీసుకోవాలని కోరాడు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.