: మూడేళ్లకే చిన్నారి సంచలనాలు


మూడేళ్ల వయసు వారికి మాటలే సరిగా రావు. వికసించని మనసు. లోకం గురించి ఏమీ తెలియని పరిస్థితి. ముద్దు ముద్దు మాటలతో గారాల లోకంలో చిన్నారులు ఆనందంగా ఉంటారు. అంత చిన్న వయసులోనూ అరుదుగా కొందరు అపార మేథస్సు, ప్రజ్ఞ ప్రదర్శిస్తుంటారు. అలాంటి వారిలో రష్యాకు చెందిన ఆలిస్ కూడా ఇప్పుడు చేరింది.

మూడేళ్ల వయసు వారికి ఏమి తెలుసు? ఈ ప్రశ్నకు ఆలిస్ తన తెలివితేటలతో సమాధానమిస్తోంది. ఇటీవల మెన్సా ఇంటర్నేషనల్ నిర్వహించిన ఐక్యూ పరీక్షలో ఆలిస్ బ్రహ్మండమైన స్కోరు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఐక్యూ అనేది వారి మేథస్సు, తెలివితేటలను తెలియజేస్తుంది. ఈ పరీక్షలో ఆలిస్ 162 మార్కులు సాధించింది. ఇది మామూలు స్కోరు కాదు. విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ప్రజ్ఞతో సమానం. ఆయన ఐక్యూ స్థాయి కూడా 160 నుంచి 165 మధ్య ఉంటుందని అంచనా. విశేషం ఏమిటంటే, మరో ప్రసిద్ధ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ కంటే ఆలిస్ ఐక్యూనే ఎక్కువ. సిగ్మండ్ ఐక్యూ 156 మాత్రమే. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, అబ్రహాం లింకన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్ ఐక్యూలు 160 లోపే!

ఇప్పటివరకూ ఇంత చిన్న వయసులో కేవలం 18 మంది మాత్రమే ఐక్యూ పరీక్షలో ఈ స్థాయి స్కోరు సాధించారు. ఆలిస్ రష్యన్, ఆంగ్లంలో గడగడా మాట్లాడగలదు. ఈ చిన్నారి స్కూల్లో అడుగుపెట్టిన తర్వాత ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో.. భవిష్యత్తులో ప్రపంచ దిశను మార్చే  శాస్త్రవేత్త అవుతుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News