: కేజ్రీవాల్ కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడబోరు!


ఎంతో కాలం నుంచి ద‌గ్గు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత‌ అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో గొంతుకి సర్జరీ చేయించుకున్నారు. చికిత్స చేయించుకున్న కార‌ణంగా కేజ్రీవాల్ కొన్ని రోజుల పాటు ఎవ‌రితోనూ మాట్లాడకుండా ఉండాలని, గొంతుకు విశ్రాంతి ఇవ్వాల‌ని వైద్యులు సూచించారు. అంగిటి, కొండ నాలుకల నిర్మాణంలో ఉన్న అసాధారణతే కేజ్రీవాల్‌ గొంతు సమస్యకు కారణమని ఈ సందర్భంగా ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు చెప్పారు. లాలాజలం కొద్ది కొద్దిగా శ్వాసనాళం లోపలికి వెళుతూ ఉండటంవల్ల దగ్గు వస్తోందని, ఈ కార‌ణంగానే ఆయ‌న ఇన్నాళ్లూ ఇబ్బందులు ప‌డ్డారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ గొంతు పైభాగంలో చిన్న కండరానికి సర్జరీ చేసిన వైద్యులు ఆయ‌న కండీష‌న్‌ను బ‌ట్టి ఎప్పటి నుంచి మాట్లాడవచ్చో చెబుతారు. అయితే మాట్లాడే అవకాశం లేకపోయినా కేజ్రీవాల్ తన విమర్శలను కొనసాగించడానికి ఆయన చేతిలో ట్విట్టర్ అనే సోషల్ మీడియా అస్త్రం ఉండనే ఉంది.

  • Loading...

More Telugu News