: ఒకసారి నిమజ్జనం చూద్దామని ట్యాంక్ బండ్ కు వెళ్లి, మధ్యలోనే తిరిగొచ్చేశాను: సినీనటి ఊహ
గతంలో ఒకసారి, వినాయక నిమజ్జనం చూద్దామని చెప్పి ట్యాంక్ బండ్ కు వెళ్లానని, అయితే, ఆ జనాన్ని చూసి మధ్యలోనే తిరిగొచ్చేశానని సినీనటి ఊహ చెప్పింది. హీరో శ్రీకాంత్, ఊహల కొడుకు రోషన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొడుకుతో కలిసి ఆమె మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం విశేషాలను ముచ్చటించింది. తమ ఇంట్లో వినాయకుడిని మాత్రం దగ్గర్లో ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తుండటం ఆనవాయతీ అని చెప్పింది. ఇక, ‘నిర్మలా కాన్వెంట్’ గురించి మాట్లాడుతూ, ఈ చిత్రం అందరూ చూడదగిన సినిమా అని పేర్కొంది.