: చాలా థ్యాంక్స్ సుష్మాజీ: కేటీఆర్ ట్వీట్
లిబియాలో ఉగ్రవాదుల చెర నుంచి ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు విడుదలయ్యారన్న వార్తను సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకోగా, తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. సుష్మాకు కృతజ్ఞతలు చెబుతూ "థ్యాంక్స్ వెరీ మచ్ మేడమ్" అంటూ ట్వీట్ చేశారు. గత సంవత్సరంలో కిడ్నాప్ నకు గురైన తిరువీధుల గోపీకృష్ణ, బలరాంలు విడుదలైన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న వీరి కుటుంబ సభ్యులు ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. తన భర్తను ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు గోపీకృష్ణ భార్య తెలిపారు.
Thanks very much madam. #Respect https://t.co/KGs7940yz6
— KTR (@KTRTRS) September 15, 2016