: నేడు తెలుగుదేశంలోకి దేవినేని నెహ్రూ, అవినాష్, కడియాల... భారీ ఏర్పాట్లు


ఇంతకాలం విజయవాడలో కాంగ్రెస్ నేతగా ఉన్న దేవినేని నెహ్రూ, తన కుమారుడు, యూత్ కాంగ్రెస్ ఏపీ మాజీ అధ్యక్షుడు అవినాష్, మరో నేత కడియాల బుచ్చిబాబు సహా తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని నేడు పుచ్చుకోనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమక్షంలో వీరంతా టీడీపీలో చేరనుండగా, ఇందుకోసం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గుణదల లోని బిషప్ గ్రాసిన్ హైస్కూల్ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుండగా, మధ్యాహ్నం తరువాత ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంజ్ సర్కిల్ మీదుగా గుణదల వరకూ భారీ ర్యాలీని నిర్వహించేందుకు దేవినేని వర్గం సిద్ధమైంది. గత నెలాఖరులో వీరు ముగ్గురూ తెలుగుదేశంలో చేరడం ఖరారైన తరువాత, కాంగ్రెస్ పార్టీ వీరిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News