: ముగిసిన చివరి పూజ... మూడు కిలోల వెండి పళ్లెంలో బాలాపూర్ లడ్డూ, కాసేపట్లో వేలం


వినాయక చవితి పేరు చెబితే భిన్న రూపాల్లో వాడవాడలా కొలువైన వినాయకుడి విగ్రహాలు గుర్తొస్తాయి. అదే ఆయన చేతిలోని లడ్డూ ప్రసాదం పేరు చెబితే, ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ లడ్డూయే. హైదరాబాద్ పాతబస్తీలోని బాలాపూర్ లో కొలువుదీరే వినాయకుడి చేతిలోని లడ్డూ వేలం పాట తెలుగురాష్ట్రాల్లోనే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సంవత్సరం నిమజ్జన వేడుకలు గురువారం నాడే ముగించాలని అధికారులు నిర్ణయించుకున్న నేపథ్యంలో పాతబస్తీ నుంచి సాగే శోభాయాత్రకు ముందు నిలిచే బాలాపూర్ గణేశ్ విగ్రహానికి ఇప్పటికే చివరి పూజలు పూర్తికాగా, విగ్రహం ట్రాలీ ఎక్కింది. ప్రస్తుతం బాలాపూర్ వీధుల్లో ఊరేగింపు సాగుతుండగా, మరికాసేపట్లో లడ్డూ వేలం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. గత సంవత్సరం ఈ లడ్డూను కల్లెం మదన్‌ మోహన్‌ రెడ్డి అనే వ్యక్తి రూ. 10.32 లక్షలకు దక్కించుకోగా, ఈ సంవత్సరం మూడు కిలోల బరువున్న వెండి పళ్లెంలో లడ్డూ ప్రసాదాన్ని ఉంచి పూజలు జరపడం విశేషం.

  • Loading...

More Telugu News