: బిచ్చమెత్తిన సొమ్ముతో ‘వేలం లడ్డు’ను దక్కించుకున్న దంపతులు
బిచ్చమెత్తగా వచ్చిన సొమ్ముతో వినాయకుడి వేలం లడ్డును గిరిజన దంపతులు సొంతం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కురవిలోని చెంచు కాలనీకి చెందిన గడ్డం వెంకన్న, మంగమ్మ దంపతులకు భిక్షాటన ప్రధాన జీవనాధారం. అయితే, వీరు అప్పుడప్పుడు కూలీ పనులకు వెళుతుంటారు. ఈ విధంగా సొమ్ము కూడబెట్టారు. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో పాల్గొన్న ఈ దంపతులు రూ.26,116 చెల్లించి గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ గిరిజన దంపతులను పలువురు అభినందించారు.