: అతిపెద్ద విలీనం... ఒక్కటైన ‘రిలయన్స్’, ‘ఎయిర్ సెల్’
టెలికాం రంగంలో ఎదురవుతున్న తీవ్ర పోటీని తట్టుకునేందుకుగాను ‘రిలయన్స్’, ‘ఎయిర్ సెల్’ సంస్థలు విలీనం కాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు తెరపడింది. దేశ టెలికాం రంగంలోనే అతిపెద్ద విలీనం జరిగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్ సెల్ సంస్థలు ఒక్కటయ్యాయి. ఉమ్మడి సంస్థలో రిలయన్స్’, ‘ఎయిర్ సెల్’ కు 50 శాతం చొప్పున వాటా లభించనుంది.