: ప్రపంచమంతా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడొచ్చు కానీ, నేను మాట్లాడకూడదా?: రేణుదేశాయ్


‘ప్రపంచం మొత్తం పవన్ కల్యాణ్ గురించి మాట్లాడొచ్చు కానీ, నేను మాత్రం ఎందుకు మాట్లాడకూడదు?’ అంటూ రేణు దేశాయ్ ప్రశ్నించింది. పవన్ గురించి తాను మాట్లాడుతుండటంపై ట్విట్టర్ ద్వారా కొంతమంది ఆమెను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇందుకు సమాధానమిస్తూ, పదకొండేళ్ల పాటు పవన్ కు తాను భార్యగా ఉన్నానని, 17 ఏళ్లుగా తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది. గత ఆరేళ్లుగా తమ పిల్లల కోసం అప్పుడప్పుడూ పవన్, తాను కలుస్తున్నామని అన్నారు. పవన్ గురించి తాను మాట్లాడకూడదని కొంతమంది ఎందుకు ప్రశ్నిస్తున్నారో తనకు అర్థం కాలేదని పేర్కొంది. చిన్న కారణం వల్ల తాము విడాకులు తీసుకున్నామని, తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News