: నయీమ్ కేసులో మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 70కి పైగా నయీమ్ అనుచరులను, అతనితో సంబంధం ఉన్న నేరస్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు వేర్వేరు ప్రాంతాల్లో మరో ఐదుగురిని అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో వావిళ్ల సంజీవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గుంటూరులో శ్రీను, సందీప్, కృష్ణయ్య, రమేశ్‌లను సిట్ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు.