: నందిగామ ఎమ్మెల్యేకు అస్వస్థత
కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో, విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్ర ఆసుపత్రిలో చేరారు. ఆమెకు డెంగీ లక్షణాలున్నాయనే అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని ఆమెకు వైద్యులు సూచించారు. కాగా, నందిగామ నియోజకవర్గంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.