: భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్ అదృశ్యంపై స్పందించిన జైళ్ల శాఖ డీజీ
తనను అకారణంగా బదిలీ చేశారంటూ లేఖరాసి నల్గొండ జిల్లా భువనగిరి సబ్‌జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ డీజీ వి.కె.సింగ్ వేధింపులు ఎక్కువయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై డీజీ స్పందించారు. భువనగిరి సబ్‌జైల్‌పై వస్తోన్న ఫిర్యాదులపై తాము విచారణ జరిపిన తరువాతే శ్రీనివాసరావుతో పాటు మరో నలుగురిపై చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. జైళ్లలో అవినీతికి పాల్పడితే ఎవ్వరినీ ఉపేక్షించబోమని ఆయన వ్యాఖ్యానించారు. తాము చట్టప్రకారం తీసుకునే చర్యల్లో భాగంగానే శ్రీనివాసరావుపై చర్యలు తీసుకున్నామని వివరించారు.