: రేపు సెలవు, నవంబర్ 12 పనిదినం: కేసీఆర్ సర్కారు ఆదేశం
గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా గురువారం (15-9-2016) నాడు సెలవు ప్రకటిస్తున్నట్టు కేసీఆర్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రతిగా నవంబర్ 12న రెండో శనివారం సెలవును పనిదినంగా మారుస్తూ, కొద్దిసేపటి క్రితం జీవో జారీ అయింది. రేపు నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో పాఠశాలలకు విద్యార్థులు, కార్యాలయాలకు అధికారులు చేరుకోవడం కష్టం కానున్న నేపథ్యంలోనే సెలవు ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. ఈ సెలవు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అమలవుతుందని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయని వివరించారు.