: 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 3డీ టచ్ తో రానున్న 'షియోమీ మీ5'!


ఆకర్షణీయమైన ఫీచర్లతో మరో ఫోన్ రానుంది. షియోమీ సంస్థ నుంచి రానున్న 'మీ5' స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఆన్ లైన్లో లీక్ కాగా, యాపిల్ ఫోన్లను తలదన్నేలా ఈ ఫోన్ ఉందని తెలుస్తోంది. 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 3డీ టచ్ తో పాటు, మరింత బ్యాకప్ ఇచ్చేలా 3490 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ వీఓ ఎల్ టీఈ దీని స్పెషల్ అని తెలుస్తోంది. 2.4 గీహెచ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగెన్ 821 ప్రాసెసర్, 16/4 ఎంపీ కెమెరాలు, 4కే వీడియో సపోర్ట్ తదితర సౌకర్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఈ ఫోన్ ఇండియాలో విడుదల కావచ్చని సమాచారం. చైనాలో విడుదల చేయగానే, వెంటనే ఇండియాలోనూ ఫోన్ విక్రయాలు ప్రారంభించాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News