: ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు... స్విస్ ఛాలెంజ్ విధానంపై లంచ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
రాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై ఉమ్మడి హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ అడ్వొకేట్ జనరల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని స్వీకరించేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దీంతో ప్రభుత్వం సాధారణ అప్పీలుకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. కాగా, స్విస్ ఛాలెంజ్ విధానంలో హైకోర్టు స్టే కారణంగా పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.