: నేడు భారత్ కు రానున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు


ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నేడు భారత్ కు రానున్నారు. రెండు రోజుల పర్యటనకు భారత్ రానున్న ఆయనకు విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ లో భారత ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టుల పురోగతి, ఇతర విషయాలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న బంధం బలోపేతం దిశగా ఈ పర్యటన ఉంటుందని రెండు దేశాలు భావిస్తున్నాయి. కాగా, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద బాధిత దేశాలైన భారత్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు మిత్ర దేశాలన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News