: తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలుప్రాంతాల్లో నిరంతరాయంగా వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఆవరించినందున నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. బుధ, గురువారాల్లోనూ పలుచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో భారీ వర్షాలు కురవడంతో అరకిలో మీటర్ మేర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. పల్నాడు మొత్తం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఇతర ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు.