: రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు బయలుదేరిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించేందుకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణంలో రోడ్డుమార్గం ద్వారా విజయవాడకు బయలుదేరారు. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో తిరుగు ప్రయాణంలో హెలికాఫ్టర్ ను అనుమతించేందుకు ఏటీసీ అధికారులు నిరాకరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు చంద్రబాబు బయలు దేరారు. కాగా, ఏరియల్ సర్వే అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులపై ఆయన సమీక్షించారు.