: అభిమానులకు దసరా కానుకను ఇవ్వనున్న బాలకృష్ణ


సినీహీరో బాలయ్య అభిమానులకు దసరా కానుకగా గౌతమీ పుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కానుంది. బాలకృష్ణ వందో సినిమా కావ‌డంతో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. మేకింగ్ విషయంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇటీవ‌ల ఫస్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన చిత్రం టీమ్ అభిమానుల నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. చారిత్రక నేపథ్యంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. సినిమాలో బాల‌య్య‌తో పాటు హేమమాలిని, శ్రియలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో అభిమానుల ముందుకు రాబోతున్నారు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసం బాలయ్య అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News