: ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి నాలుగు రోజులపాటు పవిత్రోత్సవాలు


విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. భాద్రపదశుద్ధ త్రయోదశి నుంచి బహుళ పాడ్యమి వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు దుర్గ గుడి ఈవో సూర్యకుమారి తెలిపారు. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ శుద్ధి జరుగుతుందని, ఈ నేపథ్యంలో రేపు మహా నివేదన అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నట్లు చెప్పారు. 15వ తేదీ ఉదయం 9 గంటలకు స్నపనాభిషేకం తర్వాత ఆలయం తలుపులు తెరచుకోనున్నట్లు దేవాలయ పూజార్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News