: ఉత్తరప్రదేశ్‌లో పెను విషాదం.. బస్సుపై తెగిపడ్డ హైటెన్షన్ వైర్లు..9 మంది ప్రయాణికులు మృతి


ఉత్తరప్రదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఈటాలో ప్ర‌యాణికుల‌తో వెళుతోన్న‌ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ప్రమాదం సంభ‌వించింది. ప్ర‌మాదంలో 9 మంది ప్రయాణికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది ప్ర‌యాణికుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని, గాయాల‌పాల‌యిన వారిని ద‌గ్గ‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. బ‌స్సుపై తెగి ప‌డిన వైర్ల‌ను క్రేన్ సాయంతో తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో అక్క‌డి ప్రాంతంలో ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది.

  • Loading...

More Telugu News