: హింసతో సమస్యలు మరింత జటిలమవుతాయి!: కావేరీ జల వివాదంపై ప్రధాని మోదీ


కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, హింసతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఇలాంటి వివాదాల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. హింసతో సమస్యలు మరింత జటిలమవుతాయని ఆయన పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కావేరీ జల సమస్య కూడా చర్చలతో పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భావోద్వేగాలకు గురి కాకుండా ప్రజలు సంయమనం పాటించాలని ఆయన రెండు రాష్ట్రాల ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News