: కోరిన వెంటనే రైల్లో బెర్త్... 2020 నాటికి: కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా


కోరుకున్న వెంటనే రైలు ప్రయాణికులకు బెర్త్/సీటు సమకూర్చే దిశగా రైల్వే శాఖ చర్యలు ప్రారంభించింది. 2020 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా సామర్థ్య విస్తరణపై దృష్టి సారించింది. 2020 నాటికి కోరుకున్న వెంటనే రిజర్వేషన్ పొందేలా నెట్ వర్క్ ను తీర్చిదిద్దాలన్నది తమ అభిమతమని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ప్రస్తుత రైల్వేల సామర్థ్యం, ప్రయాణికుల మధ్య చాలా అంతరం ఉందని చెప్పారు. ‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ప్రయాణికుల సంఖ్య 20 రెట్లు పెరిగింది. అదే సమయంలో మౌలిక సదుపాయాలు మాత్రం 2.25 రెట్లు మాత్రమే వృద్ధి చెందాయి’ అని సిన్హా వివరించారు. గడువు దగ్గర పడుతున్న కొద్దీ రైలు ప్రయాణ చార్జీలను పెంచుతూ పోయే ఫ్లెక్సీ ఫేర్ విధానంపై మాట్లాడుతూ... దీన్ని కేవలం 77 రైళ్లల్లోనే అమలు చేస్తున్నారని, దీని వల్ల 0.2శాతం మందిపైనే ప్రభావం పడుతుందన్నారు.

  • Loading...

More Telugu News