: మనం మనుషులం...మన సోదరులనే మనం హింసిస్తున్నాం: ప్రకాశ్ రాజ్ సూచన
కావేరీ జల వివాదంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించాడు. రెండు రాష్ట్రాల్లో విధ్వంసంపై ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. ఇలా నీటి కోసం మనుషులపై దాడులకు తెగబడడం దారుణమని పేర్కొన్నాడు. నీరు అవసరాలు తీరుస్తుందని, నీటి కోసం ప్రాణాలు తీసుకోవడం అనాగరికమని సూచించాడు. ఇంతా చేసి మనం హింసిస్తున్నది ఎవరిని? సాటి భారతీయుడైన పొరుగు రాష్ట్ర సోదరుడినే కదా? అని నిలదీశాడు. మనం ముందు మనుషులమన్న సంగతి గుర్తించాలని సూచించాడు. హింస దేనికీ పరిష్కారం కాదని, సోదరులను హింసించడం వల్ల ఆనందం రాదని తెలిపాడు. సంయమనం పాటించాలని రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రకాశ్ రాజ్ సూచించాడు.