: టర్కీలో కారుబాంబు పేలుడు.. 48 మందికి గాయాలు


టర్కీ మరోమారు బాంబు పేలుడుతో దద్దరిల్లింది. తూర్పు టర్కిష్ పట్టణమైన వాన్‌లోని అధికార పార్టీ కార్యాలయం(ఏకేపీ) ఎదుట ఉగ్రవాదులు కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 48 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసు అధికారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గతంలో ఇదే పార్టీ కార్యాలయం వద్ద కుర్దిష్ తీవ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ప్రకటన విడుదల కాలేదు.

  • Loading...

More Telugu News