: జర్మనీ భామ ఏంజెలిక్ చిద్విలాసం.. వోజ్నియాకిపై గెలుపుతో అగ్రస్థానం
మహిళల సింగల్స్‌లో జర్మనీ భామ ఏంజెలిక్ కెర్బర్ టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. సెమీస్‌లో వోజ్నియాకిపై గెలిచిన ఏంజెలిక్ ఫైనల్‌కు చేరకోవడంతో అగ్రస్థానం సొంతం చేసుకుంది. డబ్ల్యూటీఏ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఏంజెలిక్కు టాప్‌ర్యాంక్ దక్కింది. అమెరికా నల్లకలువ సెరీనా ర్యాంకింగ్స్‌లో రెండోస్థానానికి పడిపోగా ముగురుజ 3, రద్వాన్‌స్కాకు 4 స్థానం దక్కింది. తనకు టాప్ ర్యాంక్ దక్కినందుకు ఏంజెలిక్ సంతోషం వ్యక్తం చేసింది. ఇకముందు కూడా ఇదే ఆటతీరుతో ర్యాంక్‌ను నిలుపుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.