: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫొటోపై క్లిప్ ఆర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు
వాట్సాప్ మెసెంజర్ ప్రేమికులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. స్నాప్‌చాట్‌కి తాజాగా బీటా 2.16.264 వెర్షన్‌తో అప్డేట్ చేసింది. ఫలితంగా ఫొటోలపై క్లిప్ ఆర్ట్స్ పెట్టుకునే సౌలభ్యం లభించింది. ఇమేజ్‌పై కావాల్సిన టెక్స్ట్‌ను కూడా రాసుకోవచ్చు. ఫొటోపై డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఫొటోలు షేర్ చేసుకునే అవకాశం మాత్రం ఇందులో లేదు. ఇక్కడ ఇంకో విషయం గురించి తెలుసుకోవాలి. కేవలం మన స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి వాట్సాప్ ద్వారా తీసిన ఫొటోలకు మాత్రమే ఎఫెక్ట్స్ ఇవ్వడం వీలవుతుంది. షేర్ చేసుకునే వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్ట్ దశలో ఉంది. త్వరలో అధికారిక వెర్షన్‌ను విడుదల చేస్తారు.