: తెలంగాణ టీచర్లకు పండగ లాంటి కబురు.. ఇక నెలనెలా ప్రమోషన్లు
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇది పండగ లాంటి వార్తే. పాఠశాల విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు ఇక నుంచి నెలనెలా ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై పీఆర్టీయూటీఎస్, పీఆర్టీయూ రాష్ట్ర, తెలంగాణ రాష్ట్రనాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉపాధ్యాయుల పనితీరు మరింత మెరుగుపడే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.