: మన ఖాతాలో మరో పతకం...పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన మొట్టమొదటి భారత మహిళ
పారా ఒలింపిక్స్ లో పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా దీపా మాలిక్ రికార్డుల కెక్కింది. మహిళల షాట్ పుట్ విభాగంలో దీపా మాలిక్ రజత పతకం సాధించింది. ఈరోజు జరిగిన ఫైనల్లో 4.61 మీటర్ల దూరం విసిరిన ఆమె ద్వితీయ స్థానంలో నిలిచింది. బహ్రెన్ కు చెందిన ఫతేమా నేథమ్ 4.76 మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించగా, గ్రీస్ కు చెందిన దిమిత్రా 4.28 మీటర్లతో కాంస్యం సాధించింది. దీపా మాలిక్ పతకం సాధించడంతో పారా ఒలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు సాధించిన మెడల్స్ సంఖ్య మూడుకు చేరింది.