: విష పురుషుడు... పదేళ్లలో పన్నెండు సార్లు పాములు కరిచినా నిక్షేపంలా ఉన్నాడు!
పాత తెలుగు సినిమాల్లో విష కన్యలు, విష పురుషులు ఉండేవారు. వారిని పాములు కాటేసినా ఎలాంటి ప్రమాదం వాటిల్లేది కాదు. అచ్చం ఇలాంటి వ్యక్తే కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రాంతంలో బీజాపూర్ అనే గ్రామంలో వున్నాడు. ఈ గ్రామంలో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. దీంతో ఈ గ్రామంలోని వారికి ఏ రోగమొచ్చినా, రొష్టు వచ్చినా పట్టణానికి వెళ్లాల్సిందే. ఈ గ్రామానికి చెందిన లింగరాజ్ ను పాములు కాటేస్తున్నాయి. గత పదేళ్లలో లింగరాజ్ ను పాములు పన్నెండు సార్లు కాటేశాయి. పాము కాటేసిన ప్రతిసారి లింగరాజ్ కాసేపు అస్వస్థతకు గురవుతాడు. తరువాత వెంటనే లేచి పని చేసుకుంటాడు. కనీసం ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్లలేదు. ఈ మధ్యే సుస్తీగా ఉందని లింగరాజ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుడి ప్రశ్నలకు సమాధానమిస్తూ పన్నెండు సార్లు పాములు కరచాయని తెలిపాడు. దీంతో అవాక్కైన ఆ వైద్యుడు మరిన్ని పరీక్షలు నిర్వహించి, పాము కటేసినా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, ఇలాంటి కేసును గతంలో తామెప్పుడూ చూళ్లేదని తెలిపారు.