: ‘అవినీతి’ మంత్రులపై వేటు వేసిన యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇద్దరు మంత్రులపై వేటు వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్ సింగ్‌లను కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్‌పై ఇటీవలే అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. దీనిపై స్పందించిన అఖిలేశ్ సర్కార్ సీబీఐ దర్యాప్తు ఆదేశాలను హైకోర్టు ఉపసంహరించుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వం చేసిన అభ్యర్థనను న్యాయస్థానం వ్యతిరేకించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయత్రి ప్రసాద్ ప్రజాపతి, రాజ్‌కిషోర్ సింగ్‌లపై అఖిలేశ్ ఈ చర్యలు తీసుకున్నారు. మంత్రులపై వచ్చిన ఆరోపణలతో ఆ రాష్ట్ర ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.