: పోకెమాన్‌ గో గేమ్ ఆడుతూ వెళ్లి నదిలో పడిపోయిన వ్యక్తి


మొబైల్‌ గేమ్‌ పోకెమాన్‌ గో ఆడుతూ ప్ర‌మాదాల బారిన ప‌డుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నా ఎంతో మంది స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు ఆ గేమ్ పిచ్చిలోనుంచి బ‌య‌టికి రాలేక‌పోతున్నారు. ఆస్ట్రేలియాలో పోకెమెన్ గేమ్ ఆడుతూ వెళ్లి ఓ వ్యక్తి నదిలో పడిపోయాడు. వెంట‌నే స్పందించిన అక్క‌డి సిబ్బంది అతడిని రక్షించి, పోలీసులకి స‌మాచారం అందించారు. ఆ వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

  • Loading...

More Telugu News