: హైదరాబాద్ లోని మా భూమి ఫెన్సింగ్‌ను అధికారులు తొలగించారు.. రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లా: ఎంపీ కొత్తపల్లి గీత
విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత తమ భూమిలో ఫెన్సింగ్‌ను అధికారులు తొలగించినట్లు మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని రాయదుర్గం సర్వే నెంబరు 83/2లో 53 ఎకరాల భూమి ఫెన్సింగ్‌ను తొలగించినట్లు పేర్కొన్నారు. ఆ భూమిని తాము ఎనిమిదేళ్ల క్రితం నిబంధనల ప్రకారం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే, ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్లు కొత్తపల్లి గీత పేర్కొన్నారు. ఆయన తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ అంశాన్ని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కొందరి ప్రోద్బలంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు.