: చంద్రశేఖరేంద్ర సరస్వతిని ఎంత భక్తిగా గౌరవిస్తానో, అబ్దుల్ కలాంని కూడా అలాగే గౌరవిస్తా!: చాగంటి కోటేశ్వరరావు
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీని తాను ఎంత భక్తితో గౌరవిస్తానో, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను కూడా అంతే విధంగా గౌరవిస్తానని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అబ్దుల్ కలాంగారి గురించి ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ఉటంకిస్తూ ఉంటాను. నేను చెప్పే సభల్లో అనేక మంది యువకులు వచ్చి కూర్చుంటారు. నేను ఒక పద్యాన్ని చెబుతున్నప్పుడు ఒక పాతకాలపు ఉదాహరణే కాకుండా, ఆధునిక ఉదాహరణ కూడా చెబుతాను. ఒక మంచి మాట చెబితే యువత ఆకర్షితులవుతారు. దానిని పాటించడానికి ప్రయత్నిస్తారు’ అని చాగంటి పేర్కొన్నారు.