: సునీల్ ఒకప్పుడు చాలా బద్ధకస్తుడు: ఆర్పీ పట్నాయక్
సినీ నటుడు సునీల్ ఇప్పుడు హార్డర్ వర్కర్ కానీ, మొదట్లో చాలా బద్ధకస్తుడని సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్, నేను రూమ్ మేట్స్ గా ఉండేవాళ్లం. మాటల రచయిత పోసాని కృష్ణమురళి దగ్గర త్రివిక్రమ్ శ్రీనివాస్ అసిస్టెంట్ గా చేసేవారు. అలాగే ట్యూషన్స్ కూడా చెబుతూ చాలా కష్టపడేవాడు. సునీల్ మాత్రం అప్పట్లో భయంకరమైన బద్ధకిస్టు. ‘ఆ.. డైరెక్టర్ వచ్చి అవకాశమిస్తాడులేరా’ అన్నట్లు ఉండేవాడు. కాకపోతే, సునీల్ మాట్లాడుతుంటే బాగుంటుంది. టైమింగ్, వెటకారం, అదంతా భీమవరం బ్లడ్ లో ఉందేమో. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉండేది. సునీల్ తో ఎవరైనా ఒక్కసారి కలిస్తే అతనితో సినిమా చేయాలనుకునేవారు ఉండేవాళ్లు. నేనేమో నా తండ్రి మీద ఆధారపడేవాడిని. డబ్బులు పంపిస్తుండేవారు. పనొస్తే చేసుకుంటుూ ఉండేవాడిని. లేకపోతే, లేదు’ అని ఆర్పీ పట్నాయక్ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.