: ముగిసిన కాపుల సమావేశం... కంట తడిపెట్టిన ముద్రగడ
కాపులను బీసీల్లో చేర్చుతామని ఇచ్చిన హామీని నెరవేర్చమని సీఎం చంద్రబాబు నాయుడిని అడిగితే అబద్ధాలతో కాలం గడుపుతున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కాపు నేతల సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాపుల రిజర్వేషన్ అంశంపై ప్రశ్నిస్తే తన భజనపరులతో చంద్రబాబు తిట్టిస్తున్నారని తనను, తన కుటుంబంలోని స్త్రీలను అసభ్య పదజాలంతో నిందిస్తూ పోలీసులతో కొట్టించారంటూ ముద్రగడ కంటతడిపెట్టారు. అవమానాలను దిగ మింగుతూ అనాథలా బతుకుతున్నానని, కాపులకు రిజర్వేషన్ సాధించే వరకు అనాథగానే ఉంటానన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్ చరిత్రలో నిలిచిపోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడతానంటే తాను నిరాహార దీక్ష చేస్తానని ముద్రగడ పద్మనాభం అన్నారు.