: ‘స్వర్ణ’ విజేత తంగవేలుకు కంగ్రాట్స్ చెప్పిన రజనీకాంత్
పారా ఒలింపిక్స్ పురుషుల లాంగ్ జంప్ లో స్వర్ణ పతకం సాధించిన మారియప్పన్ తంగవేలుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. పురుషుల లాంగ్ జంప్ విభాగంలోనే కాంస్య పతకం సాధించిన భారత్ క్రీడాకారుడు వరుణ్ భాటికీ కూడా ఇదే ట్వీట్ లో అభినందనలు తెలిపారు. కాగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన తంగవేలు స్వర్ణపతకం సాధించడంపై తమిళ సినీ నటులు సూర్య, ధనుష్, శివ కార్తికేయన్ తదితరులు అభినందనలు తెలిపారు.