: వైఎస్ మాట మేరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను: ఉండవల్లి
"మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్ బతికున్న సమయంలో ఆయనో మాట చెప్పారు. 60 సంవత్సరాలు దాటిన తరవాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు. ఎన్నికల్లో దిగకుండా, యువతరానికి ఆ బాధ్యతలు అప్పగించాలని అనేవారు. ఆ స్టేట్ మెంట్ రాసిన సమయంలో నేను ఉన్నాను. నేను, వైఎస్ కలసి దాన్ని తయారు చేశాము. ఆనాటి వైఎస్ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. నాకు 60 దాటాయి. ఇక ఎన్నికల రాజకీయాల్లో ఉండను. పోటీ చేయను" అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోనే తప్ప, రాజకీయాల్లో కొనసాగుతానని, ప్రజలకు సేవ చేసేందుకు నిత్యమూ కృషి చేస్తానని తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి రాజకీయాలు తప్ప మరేమీ తెలియవని, ఒకరిని తిట్టడం, మరొకరితో తిట్టించుకోవడం తనకు అలవాటేనని చెప్పారు.