: ఫ్లాష్..ఫ్లాష్: కశ్మీర్‌లో పోలీసులు-ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు.. పోలీసు మృతి


కశ్మీర్‌లో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు మృతి చెందాడు. పూంఛ్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఓ భవంతిలో పెద్దమొత్తంలో మారణాయుధాలు కలిగిన ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బిల్డింగ్‌ను చుట్టుముట్టారు. దీంతో భవంతిలో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందాడు. ఉగ్రవాదులు తలదాచుకున్న బిల్డింగ్ ఆర్మీ క్యాంపునకు దగ్గరగా ఉంది. సమాచారం అందుకున్న ఆర్మీ ఘటనా స్థలానికి చేరుకుని పెద్దఎత్తున బలగాలను మోహరించింది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News