: వివాదంలో చిక్కుకున్న కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్!


మోదీ క్యాబినెట్ లో అతి చిన్న వయస్కురాలైన మంత్రిగా ఉన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సహాయమంత్రి అనుప్రియా పటేల్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఢిల్లీలో కొత్త ఇంటిని అనుప్రియ నిర్మిస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణాన్ని ఆలస్యంగా చేస్తున్నారని ఆరోపిస్తూ, ఇద్దరు సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులను అనుప్రియ భర్త ఆశిష్ పటేల్ నిర్బంధించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలను మంత్రి కొట్టి పారేశారు. గిట్టని వారు ఈ ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా రాజకీయ కుట్రని ఆరోపించారు. కాంట్రాక్టర్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఆరోపణలను చేస్తున్నారని అమె అన్నారు.

  • Loading...

More Telugu News