: మేము కట్నం అడగలేదు... ఎన్టీఆర్ ఇవ్వలేదు!: తన వివాహానికి చెందిన ఆసక్తికర అంశాలు వెల్లడించిన చంద్రబాబు


సాధారణంగా రాజకీయ అంశాలు తప్ప వ్యక్తిగత విషయాలు మాట్లాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర అంశాలను వివరించారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తాను చాలా ఆవేశంగా ఉండేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత తాను 28 ఏళ్లకే మంత్రినయ్యానని ఆయన గతాన్ని గుర్తుచేసుకున్నారు. వివాహం సమయంలో తాము కట్నం అడగలేదని, ఎన్టీఆర్ కట్నం ఇవ్వలేదని ఆయన తెలిపారు. అయితే చెన్నైలో తమ వివాహాన్ని ఘనంగా జరిపించారని అన్నారు. తమ వివాహానికి దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు హాజరయ్యారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News