: కాంగ్రెస్ చేసిన తప్పిదాలకు నేను క్షమాపణ చెబుతున్నాను: చింతా మోహన్


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన పొరపాట్లకు తాను క్షమాపణ చెబుతున్నానని మాజీ ఎంపీ చింతామోహన్‌ తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ భవిష్యత్‌‌ పై ఒక పూర్తి స్థాయి అంచనాకు ఇప్పుడే రావడం తొందరపాటు అవుతుందని అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం అంచనా వేయాలంటే మరో ఆరు నెలల పాటు వేచిచూడాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీ ఎన్నికల ఫలితాలపై దేశ రాజకీయ భవిష్యత్‌ ఆధారపడి ఉందని చెప్పిన ఆయన, యూపీ ఎన్నికలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చుతాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News