: సాయంత్రం ఖైరతాబాదు గణేశుడి వద్దకు చంద్రబాబు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి సాయంత్రం ఖైరతాబాదు విఘ్న నాయకుడిని సందర్శించుకోనున్నారు. కాపేపటి క్రితం ఏపీ అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో ఖైరతాబాదు గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వారు ఖైరతాబాదు వినాయకుడిని సందర్శించుకోవాలని చంద్రబాబుకు ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నేటి సాయంత్రం వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తానని వారికి చెప్పారు.