: వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన యనమల
వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభా హక్కుల సంఘాన్ని కోరుతూ ఈరోజు శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదని పేర్కొన్నారు. సభా హక్కుల సంఘానికి వైసీపీ సభ్యుల ప్రవర్తన దృశ్యాలు పంపాలని చెప్పారు. వారిపై మూడేళ్ల పాటు చర్యలు తీసుకోవాలని తీర్మానం పెట్టారు. చెప్పులతో బల్లలు ఎక్కిన వారిని శాశ్వతంగా సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ గందరగోళ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు.