: ‘ప్యాకేజీ’కి నిరసనగా ఏపీ బంద్ షురూ!... ఎక్కడికక్కడ మొదలైన అరెస్టుల పర్వం!


ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆ రాష్ట్రంలో నేటి బంద్ అప్పుడే ప్రారంభమైపోయింది. ప్రధాన ప్రతిపక్షం సహా మిగిలిన విపక్షాలు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ బంద్ లో పాల్గొంటున్న నేపథ్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా జన జీవనం స్తంభించనుంది. తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చిన ఆయా పార్టీల నేతలు అన్ని జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించారు. ఈ క్రమంలో తిరుపతిలో ఆందోళనకు దిగిన వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సహా పలువురు వైసీపీ, వామపక్ష పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా మిగతా జిల్లాల్లోనూ రోడ్డెక్కిన అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. వెరసి పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News