: జనసేన సభలో పవన్ ప్రసంగం అనంతరం అపశ్రుతి.. ఒకరి మృతి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ లో జరిగిన సభలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రసంగం చేసి వెళ్లిన అనంతరం అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా అభిమానులు రావడంతో సభ అనంతరం అభిమానులు ఒక్కసారిగా కదలడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు పవన్ అభిమానులకి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స కోసం తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి నిలకడగా ఉండగా, మరొకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి శ్రీనివాస్ గా గుర్తించారు. అతడు ద్రాక్షారామం మండలం కుయ్యేరుకు చెందిన యువకుడు. ఆసుపత్రిలో కోలుకుంటున్న మరో యువకుడిది వై.రామవరం గ్రామంగా గుర్తించారు.