: సన్నాసుల్లారా అని తిడుతుంటే పౌరుషం లేదా? అనుకున్నా... విభజించారని 11 రోజుల పాటు భోజనం మానేశాను: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తరువాత అసంబద్ధ విభజనపై ఆవేదనతో 11 రోజులు భోజనం చేయలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. కాకినాడలో జనసేన నిర్వహించిన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'లో ఆయన మాట్లాడుతూ, తానెప్పుడూ ఈ విషయం వెల్లడించలేదని అన్నారు. సీమాంధ్ర నేతలను తెలంగాణ నేతలు సన్నాసుల్లారా, వాజమ్మల్లారా అని తిడుతుంటే... నేతలకు పౌరుషం లేదా? అని ఆశ్చర్యపోయేవాడినని ఆయన చెప్పారు. తమకు అన్యాయం జరుగుతోందని దేశంలో ఎవరు బాధపడ్డా, తాను బాధపడే వ్యక్తినని ఆయన చెప్పారు. విభజన సమయంలో ఎంపీ కొనకళ్ల నారాయణపై దాడి జరిగితే తాను బాధపడ్డానని ఆయన అన్నారు. పార్లమెంటు సమగ్రతకు, ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.